నీతి సూక్తులు మాకేనా .. మీకు కాదా..!

SMTV Desk 2017-10-16 11:42:32  yuvraj singh, DIWALI,

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 16 : నీతి సూక్తులు మాకేనా ..మీకు వర్తించవా.. అంటూ సోషల్ మీడియాలో భారత్ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌పై నెటిజన్లు మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే... ఈ మద్య యువరాజ్ దీపావళికి ఫైర్‌ క్రాకర్స్‌ నిషేధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతు తెలుపుతూ.. పటాకులు వద్దు, దీపాలు ముద్దు అని ఫ్యాన్స్‌కు పిలుపునిస్తూ ఓ వీడియో మెసేజ్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అయితే ఈ విషయం పై నెటిజన్లు యువరాజ్‌ పెళ్లి సంబరాల ఫొటోలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పెళ్లికి పటాకులు పేల్చితే కాలుష్యం కాదు. కానీ దీపావళికి కాలిస్తే వాతావరణం దెబ్బతింటుంది కదా.. యువరాజ్‌.. అంటూ కొందరూ చలోక్తులు విసురుతున్నారు.