పాక్ పై భారత్ సేన ఘన విజయం..

SMTV Desk 2017-10-16 11:31:44   Mens Hockey Asia Cup, India pakistan hockey match, dhaka, ramandeep singh

ఢాకా, అక్టోబర్ 16 : ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత్ జట్టు అదరగొట్టింది. ఫూల్ -ఏ మ్యాచ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్ ను 3-1 తేడా తో చిత్తుచేసిన భారత్ మొత్తం తొమ్మిది పాయింట్లతో, గ్రూప్ ‘ఎ’ లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. చింగల్‌సేన (13 నిమిషం), రమణ్‌దీప్‌ సింగ్‌ (44 నిమిషం), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (45 నిమిషం) ముగ్గురు చెరొక గోల్‌ కొట్టారు. పాక్‌లో అలీషాన్‌ (49 నిమిషం) ఒక్కడే ఒక గోల్ చేయగలిగాడు. టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. గత మ్యాచ్‌ల్లో జపాన్‌ను 5-1, బంగ్లాను 7-0తో ఓడించింది.