లడ్డు కోసం ఆశగా.. ధోని, జీవా చిలిపి వీడియో

SMTV Desk 2017-10-15 16:21:42  m.s dhoni, daughter jeeva, instaagram.

ముంబై, అక్టోబర్ 15 : ఎప్పటికప్పుడు తన చిట్టి తల్లి చేసే చిలిపి చేష్టలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు ధోనీ. మొన్న జీవా.. టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సరదాగా ముచ్చటించిన వీడియోను పోస్ట్‌ చేసిన ధోని ఇప్పుడు తాజాగా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. వీడియోలో ధోనీ, జీవాలు చెరో పక్క నుంచి లడ్డు తినడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ధోనీ ఈ వీడియో పోస్ట్‌ చేస్తూ ‘ఎటాక్‌ ఆన్‌ బేసన్‌ లడ్డు’ అని క్యాప్షన్‌ పెట్టాడు.