ఢిల్లీ సీఎంకు పోలీసుల సలహా..

SMTV Desk 2017-10-15 14:23:43  Delhi CM, Arvind Kejriwal, Delhi police, Car abduction

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : ఢిల్లీ సీఎం కారు అపహరణకు గురై ఇటీవల సెక్రటేరియెట్ ప్రదేశంలో దొరికింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఢిల్లీలో భద్రత సరిగా లేదంటూ పోలీసులపైనా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన స్పందించిన ఢిల్లీ పోలీసులు అపహరణకు గురైన సీఎం కారు సెక్రటేరియెట్ పార్కింగ్ ప్రాంతానికి దాదాపు 200 కిలోమీటర్లలోనే దొరికిందన్నారు. ఆ కారుకు స్టీరింగ్ లాక్ గాని గేర్ లాక్ సిస్టం గాని లేవని ఇలా ఉంటే కారును ఎవరైనా దొంగిలిస్తారని పోలీస్‌ ప్రతినిధి మధూర్‌ వర్మ వెల్లడించారు. పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను పార్క్ చేయాలని, ప్రస్తుతం చోరీకి గురవుతున్న వాహనాలన్నీ పార్కింగ్ ప్రదేశాల్లో ఉండడం లేదని వ్యాఖ్యానించారు.