వీలినం.. కొనుగోలు.. తేడా ఏంటి..

SMTV Desk 2017-10-15 13:11:45  Purchase, Tech Mahindra, Satyam Computers, Tata Steel-Chorus

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : ప్రస్తుత భారత ఆర్ధిక రంగంలో విలీనాలు, కొనుగోళ్ల మాటలు వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది ఈ రెండు ఒకటే అని అనుకుంటున్నారు కానీ సాంకేతికంగా చూస్తే విలీనానికి, కొనుగోలుకు మధ్య తేడాలున్నాయి. వీలినం అనగా.. రెండు లేదా ఎక్కువ కంపెనీలు కలిసిపోయి ఒక కొత్త కంపెనీగా రూపాంతరం చెందడాన్ని విలీనంగా నిర్వచించవచ్చు. ఇందుకు ఉదాహరణగా టెక్‌ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్‌ల విలీనాన్ని చెప్పుకోవచ్చు. వీలినం తరువాత సత్యం కంప్యూటర్స్ బ్రాండ్ కానీ ఆ పేరు కానీ కనిపించలేదు. అదే సత్యంను టెక్ మహీంద్రా కొనుగోలు చేస్తే సత్యం కంపెనీ అలానే ఉండేది. కేవలం యాజమాన్యం మాత్రం మారేది. కొనుగోలు అనగా .. ఒక కంపెనీ మరొక కంపెనీలో మెజారిటీ వాటా లేదా పూర్తి వాటాను కొనుగోలు చేసి టేకోవర్‌ చేయడాన్ని కొనుగోలుగా పిలుస్తాం. అంటే కొనుగోలు చేసిన రెండో కంపెనీకి యజమాని అవుతుంది. చట్టబద్ధంగా చూస్తే రెండు కంపెనీలూ ఉంటాయి. కానీ యజమాని ఒక్కరే. ఇందుకు ఉదాహరణ టాటా స్టీల్‌-కోరస్‌ కొనుగోలు. ఒక్క మాటలో చెప్పాలంటే కొనుగోలు అనంతరం కూడా రెండో కంపెనీ బ్రాండ్‌, పేరు, అస్థిత్వం కొనసాగుతుంది. అదే విలీనం అయితే రెండో కంపెనీ కనుమరుగవుతుందన్న మాట.