అశ్విన్, జడేజా పై మళ్ళీ వేటు..

SMTV Desk 2017-10-15 11:43:56  India, New zealand series, ODI SERIES, SELECTION COMITEE

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : భారత్ సీనియర్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజాలపై సెలక్షన్‌ కమిటీ మళ్లీ వేటు వేసింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం భారత్ జట్టుని ప్రకటించిన కమిటీ యువ స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌ నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో సీనియర్ల పేర్లను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. మరో వైపు వరుసగా విఫలమవుతున్న కర్ణాటక బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ని కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. బౌలింగ్ విభాగ౦లో పేసర్లు మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ను కివీస్‌ సిరీస్ కోసం తప్పించారు. అయితే వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్, యువ పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌లకు జట్టులో స్థానం కల్పించారు. భారత్‌-కివీస్‌ మూడు వన్డేల సిరీస్‌ ఈ నెల 22న ముంబైలో ప్రారంభమవుతుంది. భారత వన్డే జట్టు - కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధావన్, రహానే, మనీశ్‌ పాండే, జాదవ్, దినేశ్‌ కార్తీక్, ధోని, పాండ్యా, అక్షర్ పటేల్, కులదీప్‌ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, శార్దుల్‌ ఠాకూర్‌.