నేటి నుండి అమెజాన్ దీపావళి సేల్..

SMTV Desk 2017-10-14 18:24:59  AMAZON, DIWALI SALE, OFFER ON MOBILE PHONES.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : నిన్నటి వరకు దసరా ఆఫర్లతో సందడి చేసిన అమెజాన్ నేటి నుండి దీపావళి ఆఫర్లను వినియోగదారులకు అందించనుంది. "అమెజాన్ దీపావళి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్" సేల్ పేరుతో నేటి నుండి 17 వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మొబైల్ ఫోనులతో పాటు దాదాపు అన్ని విభాగాలలో భారీ రాయితీలను ప్రకటించింది. ఐఫోన్ 7, రెడ్‌మీ 4, ఆసుస్ జెన్‌ఫోన్ 3, వన్ ప్లస్ 5 ఫోన్ లపై భారీ రాయితీ ప్రకటించగా, ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి మాత్రం అదనంగా పదిశాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలియజేసింది.