ఫ్లిప్ కార్ట్ టాప్...

SMTV Desk 2017-10-14 18:23:56  Flip cart, Download, google play store

హైదరాబాద్, అక్టోబర్ 14 : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ డౌన్ లోడ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్ 100 మిలియన్ డౌన్‌లోడ్లను అంటే 10 కోట్ల మార్కును అధిగమించడం విశేషం. దేశంలో ఈ ఘనత అందుకున్న తొలి ఈ-కామర్స్‌ యాప్‌ ఫ్లిప్‌కార్ట్‌దేనని సంస్థ తెలియజేయగా, గూగుల్ ప్లే స్టోర్ లో ఇచ్చే రేటింగ్ లో యాప్‌కు 5 రేటింగ్ కు సగటున 4.4 రేటింగ్‌ వస్తుందని కంపెనీ తెలిపింది. కాగా, ప్లిప్‌కార్ట్‌ తన బిగ్‌ దీపావళి సేల్‌ను నేటి నుంచి ప్రారంభించింది.