ఇక కివీస్‌ తో...

SMTV Desk 2017-10-14 15:51:19  India, New zealand series, Wankhede in Mumbai.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : నిన్నటి వరకు ఆసీస్ తో 5 వన్డేలు, మూడు టీ-20 లు ఆడిన భారత్ వన్డే సిరీస్ ను 4-1 తో కైవసం చేసుకోగా టీ-20 సిరీస్ 1-1 తో సమమైన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లిసేన న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 22 నుంచి నవంబర్‌ 7 వరకు న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. దీనిలో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌ జట్టు తొమ్మిది మంది ఆటగాళ్లతో పాటు, కోచ్‌, సిబ్బందితో భారత్‌ చేరుకుంది. అక్టోబరు 22న ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే జరగనుంది. అంతకుముందు ఇండియా బోర్డు ప్రెసిండెంట్స్‌ ఎలెవన్‌తో న్యూజిలాండ్‌ రెండు సన్నాహక (అక్టోబరు 17,19న) మ్యాచ్‌లను ఆడనుంది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న న్యూజిలాండ్‌-ఎ జట్టు నుంచి మిగతా ఆరు మంది ఆటగాళ్లను ఎంచుకోనున్నట్లు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ తెలిపింది.