శ్రీశైలం నుంచి సాగర్ కు నీటి విడుదల..

SMTV Desk 2017-10-14 12:53:52  Srisailam reservoir, Dam Chief Engineer, C. Narayana Reddy.

శ్రీశైలం, అక్టోబర్ 14 : శ్రీశైల౦ జలాశయం వద్ద వరద ఉద్ధృతి మరింత పెరిగింది. ప్రస్తుత౦ 2లక్షల 4000 ఇన్ ఫ్లో వరద వస్తుండటంతో డ్యాం అధికారులు 12 గేట్లలో 5 గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఉదయం నుండి ఇన్ ప్లో 2 లక్షలు దాటడంతో డ్యాం చీఫ్ ఇంజనీర్ సి. నారాయణరెడ్డి 5 వ గేటు నుండి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఐదవ గేటును పది అడుగుల మేరకు పైకెత్తి లక్ష ముప్పై తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 884.40 అడుగుల నీటి నిల్వ 211.95 టీఎంసీలుగా ఉంది. దీంతో 2 విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఎం5 గేట్లు ఎత్తడంతో ఈ ప్రాంతమంతా సందర్శకులతో కళకళలాడుతుంది.