ఉత్తర కొరియాను ఏదో ఒకటి చేయాలి : ట్రంప్

SMTV Desk 2017-10-13 14:54:56  amerika president, trump, north koriya updates.

వాషింగ్టన్, అక్టోబర్ 13 : గత ఫిబ్రవరి నుండి ఉత్తరకొరియా 15 సార్లు పరీక్షలు జరిపి మొత్తంగా 22 క్షిపణులను ప్రయోగి౦చగా, ఆ క్షిపణులలో రెండు జపాన్ మీదుగా వెళ్ళాయి. ఇక సమస్య తారా స్థాయికి చేరుకున్న క్రమంలో ఉత్తర కొరియాను ఏదో ఒకటి చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప‌రిణామాల‌పై తాజాగా స్పందించిన ట్రంప్.. అమెరికాకు మేలు చేసే నిర్ణయాన్నే తీసుకు౦టానన్నారు. ఇది ఒక ప్రపంచ సమస్య, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసర౦ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా విషయం గురించి సైనిక, రక్షణ శాఖ సలహాదారులతో చర్చించినట్లు తెలిపారు.