ఆరుషి హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు..

SMTV Desk 2017-10-13 12:37:37  Aarushi, Rajesh and Nupur Talvar, Allahabad HC verdict updates.

లక్నో, అక్టోబర్ 13 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో తన తల్లిదండ్రులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వివరాలలోకి వెళితే.. 2008 లో పద్నాలుగేళ్ల ఆరుషి తన బెడ్ రూంలో హత్యకు గురై కనిపించింది. మొదట్లో వారి ఇంట్లో పనిచేసే హేమరాజ్ ఈ హత్యా చేసినట్లు అంతా భావించారు. కాని ఆ మరుసటి రోజు హేమరాజ్ కూడా హత్యకు గురయ్యాడు. ఇంటి పైకప్పుపై ఆయన మృతదేహ౦ కనిపించడం కలకలం రేపింది. వీరిద్దరిని ఎవరు చంపారన్నది మాత్రం ఇప్పటికి మిస్టరీగానే ఉండిపోయింది. ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆరుషి తల్లిదండ్రులే ఈ రెండు హత్యలు చేసుంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ హత్య కేసులో వీరిద్దరికి ఘజియాబాద్ లోని ఒక ప్రత్యేక సీబీఐ కోర్టు 2013 లో జీవిత ఖైదు విధించారు. ఈ సీబీఐ తీర్పుతో ఆరుషి తల్లిదండ్రులు అలహాబాద్ హైకోర్టులో అప్పీలుకు వెళ్ళారు. ఈ ఇద్దరు దంపతులపై సీబీఐ ఎలాంటి అభియోగాలను రుజువు చేయలేకపోవడంతో హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఆరుషిని, హేమరాజ్ ను ఎవరు హత్య చేశారన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో మరో ముగ్గురిని సీబీఐ అనుమానిస్తోంది.