నేడు భారత్‌-ఆసీస్‌ మధ్య తుది పోరు..

SMTV Desk 2017-10-13 10:06:37  bharth, aasis, last t20 match, uppal stadium.

హైదరాబాద్, అక్టోబర్ 13 : భారత్‌-ఆసీస్‌ మధ్య శుక్రవారం చివరి టీ20 ఉప్పల్ వేదికగా జరగనుంది. మొదటి మ్యాచ్ లో ఆసీస్ 118 పరుగులు చేయగా, రెండో మ్యాచ్ లో భారత్ కూడా 118 పరుగులు చేసింది. మూడు టీ-20ల సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ నెగ్గి ట్రోఫీ ఎవరిదో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో జరగబోయే మ్యాచ్ కి వరుణుడి ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. భారత్ జట్టు రెండో టీ20 మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రాణించాలని భావిస్తున్నారు. అయితే నాలుగో స్థానంలో విఫలమవుతున్న మనీశ్‌ పాండే స్థానంలో లోకేష్‌ రాహుల్‌ లేదా దినేశ్‌ కార్తీక్‌ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. గత మ్యాచ్ విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా ఆసీస్ జట్టు ట్రోఫీతోనే స్వదేశానికి వెళ్ళాలని పట్టుదలగా ఉంది.