పాక్ లో మరో ప్రముఖ నటి హత్య.....

SMTV Desk 2017-10-11 16:40:15  Pakisthan, Samim actor , Murder, police

ఇస్లామాబాద్,అక్టోబర్ 11: పాకిస్థానీ నటి కిస్మత్ బైగ్ ను ఆమె ప్రియుడే అతి దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాక్ లోనే మరో నటి దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....పంజాబ్ ప్రావిన్స్ లోని ముల్తాన్ ప్రాంతానికి చెందిన షామీమ్ అనే నటిని సోమవారం గుర్తు తెలియని దుండగుడు దారుణంగా కాల్చి చంపేశాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల కథనం ప్రకారం... ఓ వ్యక్తీ షామీమ్ కి ఫోన్ చేసి ఇంటి బయటకు రమ్మని చెప్పాడని, బయటకు వెళ్లిన షామీమ్ మీద కాల్పులు జరిపి పారిపోయాడని ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తన సోదరుడు రెహమాన్ తెలిపారు. షామీమ్ కి వివాహమైందని కొంతకాలం తరువాత ఆమె భర్త తో విడిపోయినట్లు తెలిపారు. ఆమె భర్తే కాల్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ళ లో తొమ్మిది మందికి పైగా నటీమణులు హత్యకు గురి కాగా వీరందరూ వారి భర్త, ప్రియులు కాల్చి చంపడం గమనార్హం.