హ్యాపీ బర్త్ డే @75.. బిగ్ బి.

SMTV Desk 2017-10-11 15:26:58  Amithab bacchan, birthday, bollywood.

ముంబై, అక్టోబర్ 11 : బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఈ రోజు 75 వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. బాలీవుడ్‌ బాద్షాగా పిలుచుకొనే అమితాబ్ పూర్తి పేరు అమితాబ్ హరివంశ్ రాయ్ బచ్చన్. ఈయన 11 అక్టోబర్ 1942న అలహాబాద్ లో జన్మించారు. ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్టార్ స్టేటస్ అమితాబ్ కి అంత సులువుగా రాలేదు. నటుడిగా తన గుర్తింపు కోసం చాల ఏళ్ళు శ్రమించారు. ఇన్నేళ్లవుతున్నా ప్రేక్షకుల్లో, పరిశ్రమలో తన ఆదరణ తగ్గని బిగ్‌బీకి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.