రిటైర్మెంట్ ఆలోచనలో భారత్ బౌలర్ నెహ్రా..

SMTV Desk 2017-10-11 15:02:13  India, Nehra, Retirement, t20 series.

ముంబై, అక్టోబర్ 11 : చాలా కాలం తరువాత భారత టీ-20 జట్టులో స్థానం సంపాదించుకున్న పేసర్ ఆశిష్‌ నెహ్రా రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు సమాచార౦. ఆసీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో బీసీసీఐ ఎంపిక చేసిన 15మంది జట్టులో నెహ్రా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రాంచీ, గువహతిలో జరిగిన టీ20 ల కోసం ఎంపిక చేసిన తుది జట్టులో మాత్రం నెహ్రాకి స్థానం దక్కలేదు. అయితే నెహ్రా రిటైర్మెంట్ ప్రకటించేది ప్రస్తుతం ఆసీస్‌తో జరిగే సిరీస్‌లో కాదు. ఆసీస్‌ పర్యటన అనంతరం న్యూజిలాండ్ భారత పర్యటనకు రానుంది. ఈ క్రమంలో నవంబరు 1న ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ-20 జరగనుంది. ఈ మ్యాచ్‌లోనే నెహ్రా రిటైర్మెంట్‌ ప్రకటించాలని యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.