ఢిల్లీలో ఎన్‌ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి

SMTV Desk 2017-10-11 13:40:47  Union Home Minister Rajnath Singh, NIA Headquarters in Delhi, Pakisthan

న్యూఢిల్లీ, అక్టోబర్ 11 : దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు జమ్ముకశ్మీర్ లో అశాంతి నెలకొనడానికి పాకిస్థాన్ నిధులు సమకూరుస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీలో ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్‌ఐఏ పని తీరుపై ప్రశంసలు కురిపించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నియంత్రించడంలో ఎన్‌ఐఏ సమర్ధంగా పని చేస్తుందన్నారు. ఉగ్రవాద కేసులో ఆధారాలు సేకరించడమే సవాలైన 95% దోషులకు శిక్ష పడేలా చేస్తున్నట్లు రాజ్ నాథ్ తెలిపారు. పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండా కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు పొరుగు దేశం నిధులు సమకూరుస్తుందని పేర్కొన్న రాజ్ నాథ్ గత జూన్ లో ఎన్‌ఐఏ జరిపిన దాడుల్లో ఈ విషయం వెల్లడైందని అన్నారు.