భారత్ కు పరాభవం.. చెలరేగిన బెహరెన్‌ డార్ఫ్

SMTV Desk 2017-10-11 12:43:12  t20 match, india, australia, guvahathi.

గువహతి, అక్టోబర్ 11 : ఆసీస్ తో జరుగుతున్న మూడు టీ-20ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో సిరీస్ ను వార్నర్ సేన 1-1 తో సమం చేసింది. ఇక ఫలితం ఉప్పల్‌లో శుక్రవారం జరిగే మూడో టీ-20లోనే తేలనుంది. ప్రధాన పేసర్‌ పాట్ కమిన్స్‌ యాషెస్‌ కోసం స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన కొత్త ఫాస్ట్‌బౌలర్ జేసన్‌ బెహరెన్‌డార్ఫ్ బరిలోకి దిగి అనూహ్య ప్రదర్శనతో 4 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. భారత్ జట్టులో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వరుసగా విఫలమవ్వడంతో 118 పరుగులకే చేతులెత్తేసింది. ధోని 13 కుదురుకున్న జంపా బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు. ఇక టీం ఇండియా ఆటగాళ్ళు ఆడడానికి ఇబ్బందిపడ్డ ఈ పిచ్ పై, ఆసీస్ ఆటగాళ్ళు సునాయాసంగా 15.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. మొదట్లో వార్నర్ ను బుమ్రా ఔట్ చేయగా, ఫించ్ ను భువేనశ్వర్ పెవిలియన్ కి పంపిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన మోజెస్‌ హెన్రిక్స్‌(62 నాటౌట్‌; (46 బంతుల్లో 4×4,4×6), టిమ్‌ హెడ్‌ (48నాటౌట్‌; 34 బంతుల్లో 5×4,1×6)తో ఆసీస్ విజయం సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా బెహరెన్‌డార్ఫ్‌ ఎంపికయ్యాడు.