జమ్మూకాశ్మీర్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. పెద్ద ఎత్తున కాల్పులు

SMTV Desk 2017-10-11 10:49:51   Jammu and Kashmir, Terrorists, Fireing, Army soldiers

జమ్మూ కాశ్మీర్, అక్టోబర్ 11 : జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బందిపోరాలోని హజీనా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రత దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 8 మంది ఉగ్రవాదులు పొదల్లో నక్కి ఉన్నట్లు గుర్తించిన ఆర్మీ బృందం, 13 ఆర్ఆర్ ఆర్మీతో పాటు, కాశ్మీర్ ఎస్ఓజీ, పోలీసులు కలిసి ఈ రేఖా ప్రాంతాన్ని మూసివేశారు. వారిని మట్టు పెట్టేందుకు ఇంకా అక్కడ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.