కోహ్లి మాత్రం మరో రికార్డు ను బద్దలు కొట్టాడు

SMTV Desk 2017-10-11 09:52:34  Guwahati, T20 match, ind vs aus T20 match, kohli, duckout record

గువహటి అక్టోబర్ 11: గువహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీం ఇండియా భారీ పరాజయం మూటకట్టుకుంది. కాగా కోహ్లి మాత్రం మరో రికార్డు ను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో కోహ్లి జాసన్ బెహ్రన్ డార్ఫ్ విసిరిన బంతిని అంచనా వేయడంలో తడబడ్డ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో 48వ టీ20 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి తొలిసారి డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఇన్నింగ్స్ లు ఆడిన తరువాత డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇంతకూ ముందు షోయాబ్ మాలిక్ పేరిట ఉండేది. 40 టీ20 మ్యాచ్ లు ఆడిన తరువాత షోయాబ్ మాలిక్ డకౌట్ అయ్యాడు. ఇప్పుడు కోహ్లి అ రికార్డు ను సవరిస్తూ 48 మ్యాచ్ ల తరువాత డకౌట్ అయ్యాడు. కోహ్లీ, షోయబ్ తరువాతి స్థానాల్లో యువరాజ్ సింగ్ (39), షెన్వారీ (38), ఇయాన్ మోర్గాన్ (35), బ్రెండన్ మెకల్లమ్ (33), గ్రేమ్ స్మిత్ (31)లు ఉన్నారు.