హ్యాక్‌ కి గురైన సాఫ్ట్ వేర్ కంపెనీ డెలాయిట్‌

SMTV Desk 2017-10-11 09:10:12  delite, hackers, america, us, customers informations hacked, govt departments of america

అమెరికా అక్టోబర్ 11: డెలాయిట్ కు చెందిన సర్వర్‌ ను దుండగులు హ్యాక్‌ చేసినట్లు సమాచారం. సాఫ్ట్ వేర్ దిగ్గజం డెలాయిట్‌ లాంటి కంపెనీలోని సుమారు 350 క్లయింట్ల వివరాలను హ్యాకర్లు తస్కరించి పెద్ద షాక్ కు గురిచేసారు. ఇందులో అమెరికా ప్రభుత్వ డిపార్ట్ మెంట్లు కూడా ఉండడం కలకలం రేపుతోంది. అలాగే అమెరికాకు చెందిన స్టేట్, ఎనర్జీ, హోం ల్యాండ్‌ సెక్యూరిటీ, డిఫెన్స్ డిపార్ట్‌ మెంట్లకు చెందిన కీలక వివరాలు తస్కరణకు గురయ్యాయని తెలుస్తోంది. దీంతో అమెరికా ఆందోళనలో పడినట్టు ఒక అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. డెలాయిట్ పై హ్యాక్ చేసిన హ్యాకర్లు ఊహించినదానికంటే ఎక్కువ డేటాను చోరీ చేసి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. . అయితే కంపెనీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని డెలాయిట్ ఈ హ్యాకింగ్ పై పెదవి విప్పడం లేదని తెలుస్తోంది. కేవలం ఆరుగురు క్లయింట్లకు సంబంధించిన సమాచారం మాత్రమే తస్కరణకు గురైందని ఓ వ్యక్తి సమాచారం ఇచ్చారని ఆ కథనం తెలిపింది. ఆ వ్యక్తీ తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదని తెలిపారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.