క్రికెట్ ఆడాలంటే యోయో పాసవ్వాల్సిందే.. బీసీసీఐ

SMTV Desk 2017-10-10 17:06:53   Yo yo Test, BCCI, CEO Rahul Johri, Team india.

ముంబై, అక్టోబర్ 10 : ఏ ఆటైనా ఆడాలంటే క్రీడాకారులకి ఫిట్‌నెస్‌ అవసరం. ప్రస్తుతం భారత్ జట్టు విజయాల వెనుక ఫిట్‌నెస్‌దే ప్రముఖ పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సీఈవో రాహుల్‌ జోహ్రీ మీడియాతో మాట్లాడుతూ... “భారతదేశం తరపున క్రికెట్ ఆడాలంటే బీసీసీఐ యోయో టెస్ట్ పాసవ్వాల్సిందే. ఈ టెస్ట్ లో విఫలమైతే ఏ ఆటగాడైనా టీమిండియా జట్టులో చోటు దక్కి౦చుకోలేడు. ఒకవేళ టెస్ట్ ఫెయిల్ అయినా ఫిట్‌నెస్‌ సాధించి మళ్ళీ వచ్చి పాస్ అవాల్సి ఉంటుంది. ఆటగాళ్ళ నియామకంలో కొన్ని నియమాలు పాటించక తప్పదని చెప్పారు”. ఆసీస్ తో వన్డే, టీ20 సిరీస్ ఎంపికలో యూవీ, రైనా చోటు దక్కించుకోలేకపోవడానికి కారణం వీరు యోయో టెస్ట్ లో ఫెయిలవ్వడం వల్లనే అని తరువాత బోర్డు కూడా స్పష్టం చేసింది.