పీబీఎల్‌ వేలంలో.. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా హెచ్ ఎస్ ప్రణయ్‌..

SMTV Desk 2017-10-10 16:54:14   Premier Badminton League, Sai Praneeth, Sreekanth

హైదరాబాద్, అక్టోబర్ 10 : పీబీఎల్‌(ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్) మూడవ సీజన్ కు ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న హెచ్ ఎస్ ప్రణయ్‌ ను అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ ఏకంగా రూ.62 లక్షలకు సొంతం చేసుకుంది. గత సంవత్సరం పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, ఇద్దరికీ పలికిన ధర కంటే ప్రణయ్‌ కే అధిక ధర పలకడం విశేషం. మొత్తం వేలంలో 8 ఫ్రాంఛైజీలు పాల్గొనగా, మొత్తం 133 మంది స్వదేశీ, విదేశీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా ఖర్చు చేసిన ఫ్రాంఛైజీగా హైదరాబాద్ హంటర్స్‌ (రూ.2 కోట్ల 39.25 లక్షలు) ,తక్కువ ఖర్చు చేసిన ఫ్రాంచైజీ నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ (రూ.2.21 కోట్లు) లుగా ఉన్నారు. ఈ వేలంలో టాప్-ఐదుగురు.. 1. ప్రణయ్‌ (రూ.62 లక్షలకు,చెన్నై) 2. శ్రీకాంత్‌(రూ.56.10 లక్షలకు, అవధె) 3. తియాన్‌ హూవీ (రూ.58 లక్షలకు,దిల్లీ ఏసర్స్‌) 4. షిన్‌ బీక్‌(రూ.55 లక్షలు,నార్త్‌ ఈస్టర్న్‌) 5. క్రిస్‌ అడ్‌కాక్‌(రూ.54 లక్షలు,చెన్నై)