బాణాసంచాలు వద్దు : క్రికెటర్ యువరాజ్

SMTV Desk 2017-10-10 16:42:51   Indian cricketer, Yuvraj Singh, Twitter updates.

పంజాబ్, అక్టోబర్ 10 : దీపావళి పండగ అంటేనే జిగేల్ మనే కాంతులు.. అదిరిపోయే శబ్దాలు.. కానీ వీటి వల్ల జరిగే నష్టం మాత్రం ఊహించలేనిది. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సామాజిక మాధ్యమ౦ ట్విట్టర్ వేదికగా అదిరిపోయే సందేశం ఇచ్చాడు. “బాణాసంచాలు వద్దు... కాలుష్యం లేని దీపావళిని జరుపుకుందాం” అనే ట్యాగ్ లైన్ తో ఓ ట్వీట్ చేశాడు. గత సంవత్సరం కాలుష్యం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందిని గుర్తుచేసుకు౦టూ ఒక వీడియోను రూపొందించిన యువీ ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.