ఆచంట ప్రముఖులకు అన్వేషి టీవి ఛానల్ పురస్కారాలు...

SMTV Desk 2017-10-10 15:45:56  West Godavari, Achanta constituency, Anveshi tv channel Updates.

తూర్పు గోదావరి, అక్టోబర్ 10 : "అన్వేషి" టీవి న్యూస్ ఛానల్ ద్వితీయ వార్షికోత్సవం, 500 సంవత్సరాల క్రిస్టియన్ రిఫార్మేషన్ డే సందర్భంగా.. పలువురు ప్రముఖులకు విశిష్ట సేవా పురస్కారాల ప్రదానం చేసారు. ఆ ప్రముఖులు ఎవరంటే.. * కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన పోడూరు మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గుంటూరి వాణి పెద్దిరాజుకు, మహిళా సాధికారత, శిశు సంక్షేమం, ఆర్ధిక స్వావలంబనకు గాను అవార్డుకు ఎంపిక చేశారు. * పోడూరు మండల పండితవిల్లూరు గ్రామానికి చెందిన న్యూ లైఫ్ మినిస్ట్రీస్ డైరెక్టర్, పోడూరు మండల యునైటెడ్ పాస్టర్స్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు, పండితవిల్లూరు ఐ.పి.సి చర్చి సీనియర్ పాస్టర్ గెడ్డం సామ్యేల్ జాన్సన్ కు ఆధ్యాత్మిక, సామాజిక, స్వచ్ఛంద సేవా రంగాల్లో చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. * ఆచంట బీఎస్ఎన్ఎల్ జూనియర్ ఇంజనీర్ శ్రీ బొడ్డు విక్టర్ బాబు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి సంక్షేమం, క్రైస్తవ మిషనరీస్, సామాజిక సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డుకు ఎంపిక చేశారు. * పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, పీస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శి, అంబేద్కర్ ఆలోచనా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆచంట నియోజకవర్గ జనరల్ సెక్రటరీ (మీడియా వింగ్), సామాజిక మానవ హక్కుల పరిరక్షణ, విద్యావేత్త... శ్రీ వి.ఆర్. భరత్ చవ్వాకులకు మీడియా, స్వచ్ఛంద సేవా సంస్థలు, హక్కుల పోరాట సంఘములలో చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. *ఆచంట గ్రామానికి చెందిన కల్వరి విమోచన ప్రేయర్ మినిస్ట్రీస్, ఎఐసిసి ఆచంట మండల అధ్యక్షులు, సీనియర్ చర్చి పాస్టర్ రెవ. బోళ్ళ ఆశీర్వాదంకు ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో చేసిన సేవలకు గాను అవార్డుకు ఎంపిక చేశారు. *పెనుగొండ గ్రామం దక్షిణపు పేటకు చెందిన బెతెస్థ ప్రేయర్ మినిస్ట్రీస్ అధినేత మోస్ట్ రెవరెండ్ బిషప్ బొడ్డు బాబూరావుకు ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో చేసిన సేవలకు గాను అవార్డుకు ఎంపిక చేశారు. * భీమవరం పట్టణానికి చెందిన క్రైస్తవ సువార్తీకుడు, మాలమహానాడు జిల్లా నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పగో జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు, పగో జిల్లా కులాంతర వివాహాల ప్రోత్సాహకర్త, పశ్చిమ గోదావరి జిల్లా దళిత బహుజన ప్రజాసంఘాల జేఏసీ మెంబర్, సామాజిక సేవకుడు శ్రీ గంటా సుందర కుమార్ కు సామాజిక సేవా రంగాల్లో చేసిన సేవలకు గాను అవార్డుకు ఎంపిక చేశారు. * పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, దళిత ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వసంతాడ నాగేశ్వరరావుకు దళిత బహుజన హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేశారు. అయితే 10వ తేదీన సికింద్రాబాద్ హరిహర కళాభవన్ నందు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. వీరందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, క్రైస్తవ సంస్థల నాయకుల సమక్షంలో మోమెంటొ, ప్రశంసాపత్రము, మార్టిన్ లూధర్ కింగ్ ఛాయాచిత్రం గల గోల్డ్ కోటేడ్ మెడల్ ను బహుకరించి శాలువతో సత్కరిస్తారు.