పవన్ కళ్యాణ్ తన కుమారుడితో...

SMTV Desk 2017-10-10 12:54:01  Pawan kalyan, pawan kalyan son, Janasena adinetha

హైదరాబాద్, అక్టోబర్ 10: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటా సందడి నెలకొంది. ఆయన మరోసారి తండ్రి అయ్యారు. అతని భార్య లెజ్నోవా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్....తన బిడ్డను చేతిలోకి తీసుకొని మురిసిపోతున్న ఫోటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దీంతో పవన్ కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జూనియర్ పవన్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.