బుడతడి నవ్వుకి 26 వేల మంది ఫిదా...

SMTV Desk 2017-10-10 11:50:10  hyderabad, police, swathi lakra, child kidnap case

హైదరాబాద్, అక్టోబర్ 10: నాలుగు నెలల బుడతడి చిరునవ్వుకు సామాజిక మాధ్యమంలో 26 వేల మంది ఫిదా అయిపోయారు. ఇంతకీ ఎవరీ బుడతడు? వివరాలలోకి వెళితే...హైదరాబాద్ నగరానికి చెందిన ఓ చిన్నారి గత బుధవారం అపహరణకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ చిన్నారిని కాపాడారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను నాంపల్లి ఎస్‌.హెచ్‌.ఒ. ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. సంజయ్‌ కుమార్‌ చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ చిన్నారిని ఇన్‌స్పెక్టర్‌ తన చేతిలోకి తీసుకోగానే ముసిముసిగా నవ్వాడు. ఈ క్రమంలో తీసిన ఓ ఫోటోను అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ స్వాతి లక్రా అక్టోబరు 7న తమ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే ఈ ఫోటోను 21 వేల మంది లైక్ చేయడం విశేషం.