మగవారిపై కూడా అకృత్యాలు జరిగాయి : ఫర్హాన్

SMTV Desk 2017-10-09 22:47:01  hritik roshan, farhan aktar, kangana, kangana sister rangoli, karan johar, sonali bindre, sonam kapoor

ముంబయి అక్టోబర్ 9: ‘మగవారిపై కూడా అకృత్యాలు జరిగాయి. వారూ ఎంతో అనుభవించారు. ఈ వాస్తవాన్ని న్యాయస్థానాలు కూడా ఒప్పుకొన్నాయి. కానీ హృతిక్‌ విషయంలో జరిగే అన్యాయాన్ని సహించలేక స్పందించాల్సి వస్తోంది’ అని ఫర్హాన్‌ అక్తర్‌ హృతిక్‌కి మద్దతుగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు... ‘తన సహనటుడు ఓ అమ్మాయి పట్ల ఇంత నీచంగా ప్రవర్తించాడంటే నమ్మనని పేర్కొన్నారు. ఈ విషయంలో మాట్లాడే హక్కు నాకు లేదు. దీనిని సైబర్‌ క్రైమ్‌ అధికారులే పరిష్కరిస్తారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. సమాజంలో ఎప్పుడూ మహిళలే అన్యాయానికి గురవుతుంటారు. కొన్ని ఘటనల్లో ఇది వాస్తవమే. కానీ ప్రతీ విషయంలో పురుషులదే తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకోను, కేవలం ఓ యువతి(కంగన) చేస్తున్న ఆరోపణలతోనే పేరున్న పాత్రికేయులు తప్పు హృతిక్‌దేనని అంటున్నారు. ఇది ఎంత వరకు సమంజసం’ అని ఫర్హాన్‌ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను సోనమ్‌, కరణ్‌ జోహార్‌, సోనాలి బింద్రే తదితరులు సమర్థించారు. దాంతో కంగన సోదరి రంగోలీ ఫర్హాన్‌పై స్పందిస్తూ... ‘డియర్‌ ఫర్హాన్‌.. మీరు కేవలం రోషన్‌ కుటుంబానికి సపోర్ట్‌ చేస్తూ ఈ పోస్ట్‌ రాయకుండా ఉండి ఉంటే అభినందించే దాన్ని. మొత్తం చిత్ర పరిశ్రమ కంగనకు వ్యతిరేకంగా నిలబడినా ఆమె నిలదొక్కుకోగలదు.’ అని రిట్వీట్‌ చేశారు.