టాటా గ్రూప్ సంచలన నిర్ణయం..

SMTV Desk 2017-10-09 18:57:10  Tata Group of Industries, Tele Services, Five thousand employees have to lose their jobs.

ముంబై, అక్టోబర్ 9 : ప్రముఖ ఫోన్ సర్వీస్ వెంచర్ టాటా టెలీ సర్వీసెస్ ను మూసివేయాలని టాటా గ్రూప్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐదు వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవలసి వస్తోంది. వీరికి మూడు నెలల నుండి ఆరు నెలల వరకు నోటీసులు ఇచ్చేందుకు టెలి సర్వీసెస్‌(టీటీఎస్‌ఎల్‌) పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి ప్యాకేజీలు ఇస్తామని, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి.. వీఆర్‌ఎస్ అవకాశాన్ని కల్పించినట్లు సంస్థ తెలిపింది. సంస్థ అప్పులు పెరిగి నష్టాల్లో ఉండడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం స్పష్టం చేసింది.