ఢిల్లీలో ఈసారి దీపాలతో మాత్రమే దీపావళి.... సుప్రీంకోర్టు

SMTV Desk 2017-10-09 18:33:38  New Delhi, Diwali Festivaln, Supreem court, Fireworks banned sales

న్యూఢిల్లీ, అక్టోబర్ 09 : ఢిల్లీ వాసులు ఈసారి దీపావళిని టపాసులు లేకుండా దీపాలతో మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా నవంబర్ 1 వరకు ఢిల్లీ సహా చుట్టు పక్కలా పట్టణాల్లో బాణాసంచా విక్రయించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడమే ఇందుకు కారణం. గతేడాది దీపావళి తరువాత రాజధానిలో వాయు కాలుష్యం 10 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో ముగ్గురు చిన్నారులు చేసిన వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు బాణాసంచా విక్రయాలను నిషేధించింది. జాతీయ రాజధాని ప్రాంతం ఎంసీఆర్ లో బాణసంచా జరుపరాదని 2016 నవంబర్ 11న స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మరో మారు విచారణ చేపట్టిన న్యాయస్థానం గతంలో విధించిన నిషేదాన్నితాత్కాలికంగా ఎత్తివేసింది. కాగా, ఈ నిషేధాన్ని పునరుద్దరించాలంటూ ఇటీవల మరో వ్యాజ్యం దాఖలు అవ్వగా సుప్రీంకోర్టు స్థానుకులంగా స్పందించింది. ఈ నెల 19న దీపావళి రావడంతో బాణాసంచా విక్రయాలను నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశం ఎంత మేర ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 1వ తేదీ వరకు ఢిల్లీలో ఎవరు కూడా బాణాసంచా చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.