చెల్లెలికి కీలక బాధ్యతలు అప్పగించిన కిమ్..

SMTV Desk 2017-10-09 18:18:23  North korea president, Kim Jong-un, Kim Yo Jong,

ప్యాంగ్యాంగ్, అక్టోబర్ 9 : అనాధికాలం నుండి వారసత్వంగా వస్తున్న ఉత్తరకొరియా అధ్యక్ష బాధ్యతలను కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన తండ్రి నుండి వారసత్వంగా పొందారు. ఇప్పుడు తన కుటుంబ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేయడానికి కిమ్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియా దేశంపై అధికారం చలాయి౦చడం కోసం ఉన్నత పదవిని తన చెల్లెలు కిమ్‌ యో జాంగ్‌కు కట్టబెట్టారు. మంగళవారం వర్కర్స్‌ పార్టీ 72వ వార్షికోత్సవంలో భాగంగా ఉత్తరకొరియాలో వారోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా కిమ్‌ యో జాంగ్‌ను పార్టీ సెంట్రల్‌ కమిటీ నిర్ణయాత్మక మండలిలో ప్రత్యామ్నాయ సభ్యురాలిగా ఎన్నుకున్నారు. కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఉత్తరకొరియా దుందూకుడుగా వ్యవహరించడం వెనుక పలు కీలక వ్యూహాలు రచిస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.