నిజామాబాద్ జిల్లా కార్పోరేషన్ల రూ.350 కోట్లు... ఎంపీ కవిత

SMTV Desk 2017-10-09 16:55:43  Corporations in Nizamabad district constituency, 350 crores, MP Kavitha

హైదరాబాద్, అక్టోబర్ 09 : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నియోజకవర్గంలో కార్పోరేషన్ల అభివృద్ది ప్రతిపాదనలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ లో 5 మున్సిపాలిటీల అభివృద్దికై ఒక్కో దానికి రూ.50 కోట్లు, కార్పోరేషన్ అభివృద్దికి రూ. 100 కోట్లు మంజూరైనట్లు ఎంపీ కవిత తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఐటీ ఇంక్యూబెటర్ తమ జిల్లాకు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, వచ్చే దసరా నాటికి ఐటీ హబ్ ను ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా సహకారంతో 60 ఐటీ కంపెనీలు ఈ హబ్ లోకి రాబోతున్నాయని, ఐటీ టవర్స్ కోసం రూ. 50 కోట్లు మంజూరైనట్లు ఎంపీ పేర్కొన్నారు. అలాగే కార్పొరేషన్లకు మొత్తం రూ.350 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.