ఇది "ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌" కాల౦ : చంద్రబాబు

SMTV Desk 2017-10-09 16:24:17  Black chain seminar, AP CM, Chandrababu Naidu, Round table meetings.

విశాఖ, అక్టోబర్ 9 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో అంతర్జాతీయ "బ్లాక్ చైన్" సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "బ్లాక్ చైన్" పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. నిపుణుల౦దరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ సదస్సు నిర్వహించినట్లు వెల్లడించారు. కాగా మొదటి నుండి తానూ సాంకేతిక పరిజ్ఞానాన్ని గట్టిగా నమ్మే వ్యక్తినని, ఇక ముందున్న భవిష్యత్ మొత్తం సాంకేతిక పరిజ్ఞానమే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ బ్లాక్‌ చైన్‌ పరిజ్ఞానంతో హ్యాకింగ్ బారిన పడకుండా సమాచారాన్ని కాపాడవచ్చన్నారు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ కాలమని.. ఏ పనిచేయాలన్నా వాస్తవ కాలంలో చేయవచ్చని పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలించి, ప్రజలను సంతోషంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సాంకేతికతను మరింత వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు 25 దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.