ప్రచార కార్యక్రమాలకు 60-80 కోట్లు..

SMTV Desk 2017-10-09 15:40:32   Mobikwik, Phonpe, Digital payment, Paytm, Marketing Vice President Aakash Gupta

న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : నోట్ల రద్దుతో మోడీ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలకు వాడుతున్న “మొబిక్విక్‌” తన ఉనికిని వినియోగదారులకు మరింత చేరువ చేయడం కోసం.. తన ప్రచార కార్యక్రమాలకు దాదాపుగా 60 నుంచి 80 కోట్లు ఖర్చు పెడతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రాబోయే పండుగ సీజన్ లో తమ వృద్ధిని రెండింతలు చేసుకునే అలోచనలో “మొబిక్విక్‌” కార్యాచరణ సాగిస్తుందని సంస్థ మార్కెటింగ్‌ ఉపాధ్యక్షుడు ఆకాష్‌ గుప్తా ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుత౦ విపణిలో ఆలీబాబా సంస్థతో జత కట్టిన పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే, అదే విధంగా గూగుల్ ప్రవేశ పెట్టిన తేజ్ యాప్ లాంటి చాలా సంస్థల నుండి మొబిక్విక్‌ కు తీవ్రమైన పోటీ ఉంది.