పాక్ బౌలర్ చెత్త బౌలింగ్..

SMTV Desk 2017-10-09 15:03:43  Sri Lanka - Pakistan test match, Pak bowler Wahab Riyaz, Worst bowling

దుబాయ్, అక్టోబర్ 9 : శ్రీలంక - పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆదివారం ఒక వింత సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ లో భాగంగా పాక్ బౌలర్ వహాబ్ రియాజ్ 111వ ఓవర్ లో 5వ బంతిని వేసేందుకు ఏకంగా 5 సార్లు ప్రయత్నించాడు. ఇదంతా గమనిస్తున్న కోచ్ మిక్కి అర్ధర్, పాక్ జట్టు సారధి సర్ఫరాజ్‌ అహ్మద్‌, మ్యాచ్ చూస్తున్నవారు చాలా అసహనానికి గురయ్యారు. ఇది చూసిన నెటిజన్లు రియాజ్‌ బౌలింగ్ ఎలా చేయాలో మర్చిపోయాడని.. ఒక బంతిని వేయడానికి ఇన్ని సార్లు ప్రయత్నించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు అని హేళన చేస్తున్నారు.