తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ట్రంప్

SMTV Desk 2017-10-09 14:19:44  Washington, Net Toofan, Amerika president, donald trump, Heavy rains, Weather report.

వాషింగ్టన్, అక్టోబర్ 9 : అమెరికాలో "నేట్ తుఫాన్" భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ తీవ్రతకు 28 ప్రాణాలను కోల్పోయినా.. ఆ వరద ఉధృతి మాత్రం ఆగడం లేదు. ఈ పరిస్థితి కారణంగా బిలోక్సీ, మిసిసిపీ ప్రాంతాల్లో నేట్, హరికేన్ గా మారి తీరం దాటినప్పటికీ.. వర్షాలు మాత్రం ఆగడం లేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమై జనజీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో అలబామా, ఫ్లోరిడా, లూసియానా, మిసిసిపీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. మిసిసిపీ తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి నిమిత్తం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రభావంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫ్లోరిడా పన్‌హాండ్లే, ఉత్తర జార్జియా వంటి ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.