నేడు పీబీఎల్‌ వేలం.. ప్రత్యేక ఆకర్షణగా సింధు

SMTV Desk 2017-10-09 13:09:35  Premier Badminton League, Today PBL is auction, P.V. Sindu, saina nehwal

హైదరాబాద్, అక్టోబర్ 9 : హైదరాబాద్ లో డిసెంబర్ 22 నుండి జనవరి 14 వ తేదీ వరకు జరగనున్న మూడో సీజన్ పీబీఎల్‌(ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్) ఆటగాళ్ళ వేలం ఈ రోజు జరగనుంది. ఇందులో మొత్తం 133 మంది స్వదేశీ, విదేశీ క్రీడాకారులు ఉండగా 8 ఫ్రాంఛైజీలు వేలం పాటలో పాల్గొంటున్నాయి. ఇందులో భారత్ తరుపున 82 మంది లో ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారులైన పి.వి. సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌ లు కూడా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో విక్టర్‌ ఆక్సెల్సెన్‌, సన్‌ వాన్‌ హో, కరోలినా మారీన్‌, సంగ్‌ జి హ్యున్‌, వీరే కాకుండా ఒలింపిక్స్ లో పతకాలు సాధి౦చిన 10 మంది క్రీడాకారులతో పాటు, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకాలను సాధించిన 8 మంది వేలం పాట బరిలో ఉన్నారు. వేలం పాటలో ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 2.12 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక్కో ఆటగాడిపై రూ.72 లక్షలు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. మొత్తం ఫ్రాంఛైజీలు అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, చెన్నై స్మాషర్స్‌, ఢిల్లీ ఏసర్స్‌, హైదరాబాద్‌ హంటర్స్‌, బెంగళూరు బ్లాస్టర్స్‌, ముంబయి రాకెట్స్‌, ఆవద్ వారియర్స్‌, నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ లుకా ఉన్నాయి. అయితే ప్రైజ్ మనీ 6 కోట్లు కాగా.. విన్నర్ కి 3 కోట్లు, రన్నరప్‌కు 1.5 కోట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్టుకి 75 లక్షలు అందించనున్నారు.