గోద్రా సబర్మతి కేసులో కీలక తీర్పు...

SMTV Desk 2017-10-09 13:01:08  Ahmedabad, Godhra, sabarmati train accident, highcourt,

అహ్మదాబాద్, అక్టోబర్ 9: గోద్రా సబర్మతి రైలు దహన కేసులో 31 మంది దోషులను నిర్దారించి ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుల శిక్షను తగ్గిస్తూ న్యాయస్థానం కీలక తీర్పును చెప్పింది. ఈ కేసులో 11 మంది నిందితుల ఉరి శిక్షను.. జీవిత ఖైదుగా మార్చగా, మరో 20 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. నిర్దోషులుగా విడుదలైన 63 మందిని తిరిగి విచారించాలన్న పిటిషన్ ను హై కోర్టు తిరస్కరించి, రైలు దహన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2002, ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో ఎస్6 బోగికి నిప్పుంటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో 59 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపధ్యంలో మరుసటి రోజు రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 1000 మందికి పైగా ప్రజలు చనిపోయారు.