కారులో ప్రాణాలు కోల్పోయిన బాలుడు

SMTV Desk 2017-06-06 19:41:41  sonu,car

న్యు ఢిల్లీ, జూన్ 6 : ఢిల్లీ లోని రోహణి రానిబాగ్ లో విషాదం చోటుచేసుకుంది. సోను (6) అనే బాలుడు ఆడుకోవడానికి ఇంటి బయటకు వచ్చాడు. పక్కన కారు ఉండటం తో ఆ కారు లోకి వెళ్ళాడు. కారు లోనే ఇరుక్కుపోయిఉపిరాడక మృతి చెందాడు. తమ కుమారుడు ఎంతసేపైన రాక పోయే సరికి సోను తల్లిదండ్రులు ఇంటి పక్కన ఉన్న కారులో చూడగా అందులో బాలుడు కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించరూ. అప్పటికే సోను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడు అనుకోకుండా కారులోకి వెళ్ళాడని బయటకు వచ్చే క్రమంలో ఉపిరడక చనిపోయాడని తమ ప్రాదమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.