ఫిఫా@2017

SMTV Desk 2017-10-08 19:12:07  FIFA Under 17 World Cup, Tournaments

కొచ్చి, అక్టోబర్ 8 : రెండు బలమైన జట్లు.. హోరాహోరీ మ్యాచ్.. అనుకున్నదే జరిగింది.. కానీ ఫలితం బ్రెజిల్ కు అనుకూలంగా మారింది. భారత్ లో జరుగుతున్న ఫిఫా అండర్ 17 ప్రపంచ కప్ రెండవ రోజు మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ బ్రెజిల్ జట్టు స్పెయిన్ జట్టుపై 2 -1 తేడాతో విజయం సాధించింది. పాలిన్హో కీలక గోల్ చేయగా లింకన్ కోరెయా డస్ సాంటోస్ బ్రెజిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి నుండి మ్యాచ్ లో అధిపత్యం బ్రెజిల్ దే అయినా స్పెయిన్ పోరాడింది. ముఖ్యంగా బ్రెజిల్ జట్టు తన ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేస్తూ ప్రథమార్ధంలో ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలో స్పెయిన్ ఆత్మరక్షణ ధోరణిలో ఆడినప్పట్టకీ బ్రెజిల్ ను నిలువరించలేకపోయింది. పండిత్ జవహరల్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మరో ఫేవరెట్ జట్టు జర్మనీ 2-1 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. రెండు జట్లు మొదటి నుంచి రక్షణాత్మక ఆటకు పరిమితం కావడంతో ప్రథమార్ధంలో మ్యాచ్ మెల్లగా జరగడమే కాకుండా గోల్స్ ఏమి నమోదు కాలేదు. జాన్ ఫిటే ఎఆర్‌పి గోల్ చేసి, జర్మనీ ఖాతా తెరిచాడు. ద్వితీయార్ధంలోనూ ఇరు జట్ల డిఫెన్స్ ప్లే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. 64వ నిమిషంలో ఆండ్రెస్ గోమెజ్ గోల్ చేయడంతో, కోస్టారికా ఊపిరి పీల్చుకుంది. చివరిలో నోవా అవుకూ చేసిన గోల్‌తో 2-1 ఆధిక్యాన్ని సంపాదించిన జర్మనీ అదే తేడాతో విజయం సాధించింది.