గందర గోళంగా ఐసీసీ నియమాలు..

SMTV Desk 2017-10-08 18:43:03  INDIA, AUSTRALIA, T20 MATCH, ICC RULES.

రాంచీ, అక్టోబర్ 8 : ఐసీసీ నియమాలను అర్ధం చేసుకోలేక క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఆసీస్ - భారత్ ల మధ్య జరిగిన తొలి ట్వంటీ- ట్వంటీ మ్యాచ్ లో కొత్తగా చేర్చిన నిబంధనలు ఆస్ట్రేలియా క్రికెటర్ ఫించ్ కి అర్ధం కావడం లేదని చెప్పారు. అదే విధంగా టీమి౦డియా ఆటగాడు ధావన్ కూడా కొత్త రూల్స్ పై తనకు అవగాహన లేదని తెలియజేశారు. సెప్టెంబర్ 28 నుండి ఐసీసీ కొత్త నియమాలను చేర్చి.. వాటి ప్రకారం ట్వంటీ -ట్వంటీ లో కూడా డీఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. వర్షం, ఇతర కారణాల వల్ల ఆటకు అంతరాయం ఏర్పడితే ఓవర్లను, పది ఓవర్ల లోపు కుదిస్తే ఒక్కో బౌలర్ కనీసం రెండు ఓవర్లకు తగ్గకుండా బౌలింగ్ చేయాలి. అనగా ఆట ఆరు ఓవర్లకు కుదిస్తే ముగ్గురు బౌలర్లు రెండేసి ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నైల్ ఒక్కడే రెండు ఓవర్లు వేయగా జాసన్ బెహెరెండాఫ్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా, డాన్ క్రిస్టియన్‌లు చెరో ఓవర్ వేశారు. ఈ విషయంపై ఫించ్ మాట్లాడుతూ.. ఐదు ఓవర్లు వేసేవరకు తనకు ఈ నియమం తెలియదని, విరామ సమయంలో స్మిత్ చెప్పాడని తెలిపారు. కోహ్లి కూడా కొత్త నియమాలపై అయోమయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఐసీసీ క్రీడాకారులకు నిబంధనలపై స్పష్టత ఇవ్వాలంటూ క్రీడాకారులు కోరారు.