ఆన్ లైన్ లో అంగన్ వాడీ ఉద్యోగాలు....

SMTV Desk 2017-10-08 18:29:32  Replace jobs in Anganwadi, Government preparations

హైదరాబాద్,అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఉపాధ్యాయులు, సహాయకులు, ఇంకా మినీ టీచర్ల ఉద్యోగాలకు ఆన్ లైను దరఖాస్తులను చేపడుతున్నారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ... ఈ ఉద్యోగాల్లో ఎటువంటి అవకతవకలు, సిఫార్సులు లేకుండా ఉండేందుకే ఆన్ లైను ద్వారా దరఖాస్తులు చేపడుతున్నామని, పదో తరగతి మెరిట్ ఫైనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని వెల్లడించారు. మొత్తం 5491 పోస్టులను భర్తీ చేస్తున్నామని మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లా లో ఈ ప్రక్రియ పూర్తి కాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.