జీఎస్టీ రేట్ లు తగ్గొచ్చు..!

SMTV Desk 2017-10-08 18:24:38  GST(GOODS SERVICE TAX), Slab rates, Union Finance Minister Shiva Pratap Shukla

న్యూఢిల్లీ, అక్టోబర్ 8 : జీఎస్టీ పన్ను రేట్లను ముందు ముందు మరింత తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా ప్రకటించారు. ఇప్పటికే జీఎస్టీ అమలై మూడు నెలలు కావస్తున్నా.. చాలా మందికి దీనిపై అవగాహన రాలేదు. భారతదేశంలో జీఎస్టీ అమలు పెద్ద పన్ను సంస్కరణ ఇంకా పక్కగా అమలు చేయడానికి ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం పడుతుంది. ప్రస్తుతం జీఎస్టీ స్లాబ్ రేట్స్ వరుసగా 5,12,18,28 లుగా ఉన్నాయి. ముఖ్యంగా 28 శాతం పన్ను స్లాబులో ఉన్న వస్తుసేవల సంఖ్యను తగ్గించాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కోరింది. అదే విధంగా కృత్రిమ నూలు ధారాలపై జీఎస్టీ భారాన్ని 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించడంపై సౌత్‌ ఇండియా మిల్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. జీఎస్టీ రేట్ లు తగ్గించడం వల్ల వ్యాపారుల నుండి వసూల్ చేసే ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్(ITC)ను వారి ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖమంత్రి అనంత కుమార్‌ ప్రకటించారు.