అగ్రరాజ్యంపై గురి పెట్టిన ఉత్తరకొరియా

SMTV Desk 2017-10-08 17:08:17  North Korea, United States, Missile experiment, Russian MP Anton Morozov.

ప్యాంగ్యాంగ్‌, అక్టోబర్ 8 : ఉత్తరకొరియా మరో సరికొత్త క్షిపణి ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్యాంగ్యాంగ్‌ ప్రదేశాన్ని సందర్శించిన రష్యా ఎంపీ ఆంటోన్ మోరోజోవ్‌ మాట్లాడుతూ..”మరో సరికొత్త క్షిపణిని పరిరక్షించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తోంది. అదే జరిగితే అమెరికాలోని ప్రధాన భూభాగమైన పశ్చిమ తీరాన్ని తాకగలదు.. దీనిపై వెంటనే స్పందించి సైనిక చర్యను నివారించాల్సి ఉంది” అని వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు సైతం ధృవీకరించాయి. అమెరికాలో 10 న అధికార కొరియన్‌ వర్కర్స్‌ పార్టీ వార్షికోత్సవం జరుపుకోనున్న తరుణంలో.. ఉత్తరకొరియా బలపరీక్షకు దిగవచ్చని భావిస్తు౦డగా "కొరియన్‌ మిషన్‌ సెంటర్" విభాగం అప్రమత్తమైంది. అమెరికాలో కొలంబస్ డే (9 వ తేదీ) సందర్భంగా సెలవు ప్రకటించినా మిషన్ సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండాలని సూచించారు.