తెలంగాణలో మరో ఐదు రోజులు వరుణుడు...

SMTV Desk 2017-10-08 16:10:48  Raining in Telangana State, Weather Department

హైదరాబాద్, అక్టోబర్ 08 : ఉపరితల ఆవర్తనల ప్రభావం సహా నైరుతి ఋతుపవనాలు చురుకుగా కదలడం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వరుణుడి ధాటికి పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. నాళాలు పొంగి లోతట్టు కాలనీలు, బస్తీలను ముంచేతాయి. అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జంట నగరాలలోని అమీర్ పేట్, పంజాగుట్ట, బేగంపేట, నారాయణగూడ, చాదర్ ఘాట్, బేగం బజార్,తార్నాక, హబ్సీగూడ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాదర్ ఘాట్ లో పెద్ద ఎత్తున రహదారుల పై నీరు చేరాయి.