కన్న తండ్రి..కూతురిపై దారుణం...

SMTV Desk 2017-10-08 13:32:07  Uttar pradesh, Mavu, crime, rape,

మావు, అక్టోబర్ 8: మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై ఆకృత్యాలు హద్దు మీరుతున్నాయి. సమాజంలో మహిళలు ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ కామంధుల ఆగడాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం బలి అవుతున్నారు. కన్న తండ్రి.. కూతురితో క్రూరంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఒక తండ్రి కర్కశ భావంతో తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని మావు జిల్లా కొత్వాలిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కూతురి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించి నిందితుడిని అరెస్టు చేశారు.