భారత్ శుభారంభం.. మొదటి T-20 లో ఆసీస్ పై విజయం..

SMTV Desk 2017-10-08 11:27:09  INDIA, AUSTRALIA, T20 MATCH, INDIA WON THE MATCH.

రాంచీ, అక్టోబర్ 8 : వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీం ఇండియా.. మూడు T-20 ల సిరీస్ మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది. మ్యాచ్ మద్యలో వరుణుడు అంతరాయం కలిగించినా (D/L)డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 9 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మొదట టాస్ గెలుచుకొన్న కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్ ను ఎంచుకోగా అది సరైన నిర్ణయం అని తెలుసుకోవడానికి ఎంత సేపు పట్టలేదు. భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 118 పరుగులు చేయగా వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. మరల 2 గంటల తరువాత (D/L)డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌కు 6 ఓవర్లల్లో 48 పరుగులు నిర్దేశించారు. మొదటి నుండి ఆసీస్ తడబాటుకి గురైంది. కెప్టెన్ వార్నర్ రెండు ఫోర్లతో ప్రమాదకరంగా మారే సమయంలో భువనేశ్వర్ వేసిన ప్రారంభం ఓవర్లలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫించ్ మాత్రం ఏకధాటిగా ఆడినా అటునుండి సహకారం లభించకపోవడంతో ఆసీస్ తక్కువ పరుగులకి పరిమితమై౦ది. తరువాత వచ్చిన మాక్స్వెల్ 17 పరుగులకే వెనుదిరగగా, హెడ్‌ (9) క్రిస్టియన్‌(9), పెయిన్‌(17), నైల్‌(1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్‌, పాండ్య, చాహల్‌, తలో వికెట్‌ తీయగా బుమ్రా, కులదీప్, చెరో రెండు వికెట్లు పడగొట్టారు ఇందులో ఐదు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో బుమ్రా బౌలింగ్ అద్భుతం. చేధనలో భారత్ ఏ మాత్రం తడబడలేదు. ఓపెనర్స్ లో రోహిత్(11) విఫలమయినా ధావన్(15), కోహ్లి (22) పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించారు. "మాన్ అఫ్ ది మ్యాచ్" గా కులదీప్ యాదవ్ ఎంపికయ్యాడు. తదుపరి మ్యాచ్ మంగళవారం గువహతిలో జరుగనుంది.