"నేట్" నీటి ధాటికి నేటి అగ్రరాజ్య౦...!

SMTV Desk 2017-10-08 10:57:16  Washington, Net Toofan, Heavy rains, Weather report.

వాషింగ్టన్, అక్టోబర్ 8 : వరుస తుఫాన్ లతో అగ్రరాజ్యం వణికిపోతుంది. ఇదివరకు "మారియా" రూపంలో అమెరికాను కుదిపేసి.. ఇప్పుడు "నేట్" తుఫాన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితి కారణంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి, పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇంకా ఈ తుఫాన్ ప్రభావం కొనసాగి.. నేటి ఉదయానికి హరికేన్ గా మారి గల్ఫ్ తీరం వెంబడి పయనించనుందని మియామీలోని జాతీయ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో లూసియానా, మిస్సిసిపీ, అలబామా వంటి రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. “నేట్” ను కేటగిరీ-1 తుఫానుగా పరిగణించారు. ఈ ఉద్రిక్తత ఇంకా కొనసాగనున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.