తొలి టీ-20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత్

SMTV Desk 2017-10-08 08:11:25  india, australia, ind vs aus, t20 match, india wins

ఢాకా, అక్టోబర్ 8: రాంచీలో జరిగిన తొలి టీ-20లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి, ఫీల్డింగ్ ను ఎంచుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 18.4 ఓవర్లలో 118 పరుగులు చేసే సమయానికి వర్షం అడ్డుపడింది. భారత బౌలర్లు రాణించడంతో ఐదుగురు ఆసీస్ ఆటగాళ్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. దాదాపు గంటన్నర అనంతరం వర్షం ఆగడంతో వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం 6 ఓవర్లకు 48 పరుగుల లక్ష్యాన్ని భారత్ కు విధించారు. ఆపై బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 11, శిఖర్ ధావన్ 15, కోహ్లీ 22 పరుగులు చేసి సునాయాసంగా జట్టును విజయ తీరాలకు చేర్చారు. మరో మూడు బంతులు మిగిలుండగానే... అంటే 5.3 ఓవర్లలోనే భారత జట్టు 49 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మాట్లాడుతూ...వర్షం పడకుండా ఉంటే తమకు కూడా విజయావకాశాలు ఉండేవని, భారత జట్టు చక్కగా బౌలింగ్ చేసిందని వ్యాఖ్యానించారు.