అనంతలోకాలకు చేరిన బావమరదళ్ల ప్రేమ ..

SMTV Desk 2017-10-07 19:46:45  karnool, Rudravaram, Allagadda, Accident

కర్నూలు, అక్టోబర్ 7 : బావామరదళ్ల ప్రేమ… పెళ్లి దాక వెళ్లినా ప్రయాణం వారిని అనంతలోకాలకు చేర్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే....కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి, నాగలక్ష్మి బావామరదళ్లు. వారు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అతను దివ్యాంగుడు అయినందువల్ల నాగలక్ష్మి కుటుంబం పెళ్లికి నిరాకరించి, ఆమెకు వేరే పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో వారిద్దరూ ఇంట్లో చెప్పకుండా పారిపోవాలని స్నేహితుని కారు తీసుకొని బయలుదేరారు. వేగంగా వెళ్తున్న కారు నల్లగట్ల వద్ద రోడ్డు దాటుతున్న ఓ వృద్ధున్ని ఢీ కొట్టి పక్కనే ఉన్న పొదల్లోకి వేగంగా దూసుకెళ్ళి౦ది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి, వృద్ధుడు అక్కడికక్కడే మరణించగా, విశ్వనాథరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.